23 నిమిషాల్లో ముంబై టు పుణె

2 Aug, 2019 03:31 IST|Sakshi

ప్రభుత్వ ప్రాజెక్టుగా ముంబై–పుణే హైపర్‌లూప్‌

ముంబై: ముంబై–పుణె మధ్య నిర్మించనున్న హైపర్‌లూప్‌ను ప్రభుత్వ మౌలిక వసతి ప్రాజెక్టుగా ప్రకటించే ప్రతిపాదనకు మహారాష్ట్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. భూమిపై నిర్మించే ఓ గొట్టంలో అత్యంత వేగంతో ప్రయాణించేందుకు ఈ హైపర్‌లూప్‌ ను నిర్మించాలని ప్రణాళిక ఉంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ నుంచి పుణెలోకి వాకాడ్‌ వరకు నిర్మించే ఈ హైపర్‌లూప్‌ అందుబాటులోకి వస్తే, ముంబై–పుణె మధ్య 117.5 కి.మీ. దూరాన్ని కేవలం 23 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.

రూ.70 వేల కోట్ల వ్యయంతో, రెండు దశల్లో ఈ ప్రాజెక్టును పుణె మహానగరాభివృద్ధి సంస్థ చేపడుతోంది. తొలి దశలో పుణె మహానగర పరిధిలోనే 11.8 కిలోమీటర్లపాటు హైపర్‌లూప్‌ను రూ. 5 వేల కోట్ల వ్యయంతో నిర్మించి, ప్రయోగాత్మకంగా పరీక్షిస్తారు. అంతా సవ్యంగా ఉంటే రెండో దశలో మిగతా దూరం మొత్తం హైపర్‌లూప్‌ను నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టుకు అనుమతులు సత్వరంగా లభించడం కోసం దీనిని ప్రభుత్వ మౌలిక వసతి ప్రాజెక్టుగా ప్రభుత్వం తాజాగా గుర్తించింది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సర్కిల్‌ గీసి.. అవగాహన కల్పించిన సీఎం

మహమ్మారి బారిన చిన్నారి..

ఈనాటి ముఖ్యాంశాలు

కరోనా కట్టడి : పోర్టబుల్‌ వెంటిలేటర్లు సిద్ధం

కరోనాపై సమరం : ప్యాకేజ్‌ను స్వాగతించిన రాహుల్‌

సినిమా

కరోనాపై వార్‌ : ప్రభాస్‌, ఎన్టీఆర్‌ భారీ విరాళం

‘అందుకే హిందీ ‘జెర్సీ’ని వద్దనుకున్నా’

కరోనాపై పోరాటం: చిరంజీవి, మహేశ్‌లు సైతం

కరోనా: సామ్‌ పోస్టు.. చై ‘క్వారంటీమ్‌’

‘ఊపిరి తిత్తులు ఇలాగే ఉక్కిరిబిక్కిరి అవుతాయి’

వైరల్‌ : ప్రిన్స్‌ చార్లెస్‌తో కనికా..