రైల్వే బుక్‌లెట్‌పై ప్యూన్‌ పెయింటింగ్‌ 

13 Jun, 2018 23:03 IST|Sakshi

రైల్వే శాఖలో అతను ఒక ప్యూన్‌.  కానీ అతని చేతిలో ఉన్న అద్భుతమైన కళ ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అతను వేసిన ఒక పెయింటింగ్‌ ఏకంగా రైల్వేశాఖ ప్రచురించనున్న బుక్‌లెట్‌కు కవర్‌పేజీగా ఎంపికైంది. భువనేశ్వర్‌లోని ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే ప్రధాన కార్యాలయంలో శ్యామ్‌ సుందర్‌ ప్యూన్‌గా పనిచేస్తున్నాడు. పెయింటింగ్‌లు వేయడం అతని హాబీ. ఇంటర్‌ రైల్వే పెయింటింగ్‌ పోటీల్లో శ్యామ్‌ సుందర్‌ చాలా సార్లు విజేతగా కూడా నిలిచాడు.  మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని రైల్వే శాఖ మోదీ హయాంలో తాము సాధించిన విజయాలపై ఒక బుక్‌లెట్‌ తీసుకురానుంది. ఈ బుక్‌లెట్‌కు కవర్‌పేజీగా శ్యామ్‌ సుందర్‌ వేసిన ఆర్ట్‌ వర్క్‌ని రైల్వే శాఖ ఎంపిక చేసింది.

మహాత్మాగాంధీ రైలు బోగీ దిగుతూ ఉంటే, ఆయనకు స్వాగతం పలకడానికి అభిమానులు ప్లాట్‌ఫామ్‌పై గుమిగూడి ఉన్న దృశ్యాన్ని శ్యామ్‌ సుందర్‌ పెయింటింగ్‌గా వేశారు. కవర్‌ పేజీ కోసం ఎన్నో చిత్రాలను పరిశీలించిన రైల్వేశాఖ చివరికి ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది. అంత అద్భుతమైన చిత్రాన్ని వేసినందుకు శ్యామ్‌ సుందర్‌ని ఢిల్లీకి రప్పించి సన్మానించింది. ‘నేను గత పదేళ్లుగా రైల్వే శాఖలో పనిచేస్తున్నాను. ఈ చిత్రం గీయడానికి శ్రమపడ్డాను. మొదటి రెండు సార్లు చిత్రాన్ని తిరస్కరించారు. మొదటిసారి గాంధీ కెమెరా వైపు చూస్తున్నట్టు ఉండడంతో వద్దన్నారు. ఆ తర్వాత గీసిన దాంట్లో గాంధీ ముఖం సరిగా రాలేదు. ఇక మూడోసారి గీసిన ఈ పెయింటింగ్‌ ఎంపికైంది. రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ పెయింటింగ్‌ చాలా బాగుందని ప్రశంసించడం మరచిపోలేని అనుభూతి‘ అని శ్యామ్‌ సుందర్‌ అన్నాడు. రైల్వే శాఖ నుంచి ఇంతటి అపూర్వమైన గౌరవం దక్కినందుకు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోతున్నాడు. 
 
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నేనూ వీఐపీనే.. రౌడీ సంచలన ఇంటర్వ్యూ

ఐఎంఏ జ్యువెల్స్‌ అధినేత అరెస్టు 

బిహార్‌లో మూకదాడి.. ముగ్గురి మృతి 

అరుణాచల్‌లో మూడు భూకంపాలు 

బాబ్రీ కూల్చివేతపై 9 నెలల్లో తీర్పు ఇవ్వాలి

ప్రియాంక గాంధీ అరెస్ట్‌!

ఎన్‌హెచ్చార్సీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

డిసెంబర్‌1 నుంచి అన్నీ ‘ఫాస్టాగ్‌’ లేన్లే

మరో 7 కోట్ల కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు

గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి

సంచలన ఎంపీపై పరువునష్టం దావా

ప్రియాంక గాంధీ అయితే ఓకే..

ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం

వైరల్‌: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌

ఈనాటి ముఖ్యాంశాలు

విషాదం: ఎనిమిది మంది చిన్నారుల మృతి

అదే నోటితో.. మటన్‌, బీఫ్‌ కూడా..

రిపీట్‌ కావొద్దు; కేంద్రమంత్రికి వార్నింగ్‌!

గరీబ్‌రథ్‌ రైళ్లను ఆపే ప్రసక్తే లేదు..!

పార్లమెంట్‌ సమావేశాలు మూడు రోజులు పొడగింపు!

మహిళా ఉద్యోగులకు డ్రెస్‌ కోడ్‌పై దుమారం

విడాకుల కోసం.. భార్యను స్నేహితుడితో..

చాలా అందమైన ఫొటో..ఆమె గొప్పతల్లి...

అపూర్వ శుక్లాపై చార్జీ షీట్‌ దాఖలు

ప్రియాంక గాంధీని అడ్డుకున్న అధికారులు..!

రాజకీయాల్లోకి ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌!

నాలుగు రోజుల్లోనే రెట్టించిన ఉత్సాహంతో

భార్య ప్రియునిపై పగ; తొమ్మిదిమందికి షాక్‌..!

అయ్యో! రూ.2 వేల కోసం విషా(వా)దం

ఆర్థిక బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటికి ముందస్తు బెయిల్‌.. ఊపిరి పీల్చుకున్న బిగ్‌బాస్‌

రీల్‌ ఎన్‌జీకే రియల్‌ అవుతాడా?

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష