క‌రోనాపై ప్రాంక్ చేయండి: పుణె సీపీ

1 Apr, 2020 15:15 IST|Sakshi

సాక్షి, పుణె: ఏప్రిల్‌ ఫూల్ డే సంద‌ర్భంగా సోష‌ల్‌మీడియాలో దానికి సంబంధించిన పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అయితే పుణె పోలీస్ క‌మీష‌న‌ర్ వెంక‌టేశం ట్విటర్‌లో ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ను షేర్ చేశారు. ఇప్పుడు ప్ర‌పంచ‌మంతా క‌రోనా వైర‌స్‌తో పొరాడుతున్నందున ప్ర‌తీ ఒక్క‌రూ బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించి కోవిడ్‌-19ను అంత‌మెందించే నాలుగు సూత్రాల‌ను పాటిచాల‌ని కోరుతూ నాలుగు ఫోటోల‌ను జ‌త చేశారు.

ఏప్రిల్‌ ఫూల్ రోజు నెటిజ‌న్లంతా క‌రోనాపై ప్రాంక్ చేసి దాన్ని త‌రిమికొట్టాల‌ని పేర్కొన్నారు. ‘ఇంట్లోనే ఉండండి, చేతుల‌ను త‌రుచుగా శుభ్రం చేసుకోండి, అవ‌స‌ర‌మైతే త‌ప్పా బ‌య‌టికి వెళ్ల‌కండి, అవాస్తవ ప్రచారం చేయకండి’ అంటూ క‌మిష‌న‌ర్ వెంక‌టేశం ట్వీట్ చేశారు. నెటిజ‌న్ల నుంచి ఈ ట్వీట్ కి మంచి స్పంద‌న ల‌భిస్తోంది. మేం కూడా దీనికి స‌పోర్ట్ చేస్తున్నాం స‌ర్ అంటూ చాలామంది రీ ట్వీట్ చేస్తున్నారు. (కరోనా ఎఫెక్ట్‌: సీఎం వేతనం కట్‌!)

మరిన్ని వార్తలు