దిగ్విజయ్‌ సింగ్‌ను ప్రశ్నించనున్న పూణే పోలీసులు

19 Nov, 2018 14:11 IST|Sakshi
సీనియర్‌ కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : అర్బన్‌ నక్సల్స్‌ కేసుకు సంబంధించి పూణే పోలీసులు సీనియర్ కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ను ప్రశ్నించనున్నారు. మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న లేఖలో స్నేహితుడి నెంబర్‌గా పేర్కొన్న ఫోన్‌ నెంబర్‌ దిగ్విజయ్‌ సింగ్‌కు చెందినదిగా పోలీసుల విచారణలో వెల్లడైందని డీసీపీ సుహాస్‌ బావ్చే చెప్పారు. అయితే ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని, దీనిపై మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం దిగ్విజయ్‌ను ప్రశ్నించే అవకాశం ఉందని పూణే పోలీసులు పేర్కొన్నారు.

విద్యార్థుల ద్వారా దేశవ్యాప్త నిరసనలకు సహకరించేందుకు కాంగ్రెస్‌ నేతలు సుముఖంగా ఉన్నారని కామ్రేడ్‌ సురేంద్రకు కామ్రేడ్‌ ప్రకాష్‌ రాసినట్టుగా చెబుతున్నఈ  లేఖలో ప్రస్తావించారు. ఇటీవల అరెస్ట్‌ అయిన కార్యకర్తలకు మావోయిస్టు అగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయనే ఆధారాల కోసం పూణే పోలీసులు ఈ లేఖను కోర్టులో సమర్పించారు. కాగా లేఖలో పేర్కొన్న ఫోన్‌ నెంబర్‌ దిగ్విజయ్‌ సింగ్‌దేననే వార్తల నేపథ్యంలో దీంతో తనకెలాంటి సంబంధం లేదని దిగ్విజయ్‌ తోసిపుచ్చారు.

మరిన్ని వార్తలు