సీఎం ఇంటి నుంచి ’చీపుర్లు’ తరలింపు

11 Mar, 2017 15:38 IST|Sakshi
సీఎం ఇంటి నుంచి ’చీపుర్లు’ తరలింపు

న్యూఢిల్లీ : ఢిల్లీలో పాగా వేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ అదే ఊపుతో పంజాబ్‌, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో నిరాశే మిగిలింది. గోవాలో బోణీ కొట్టకపోగా, పంజాబ్‌లో మాత్రం రెండో స్థానంలో నిలిచింది. ఎన్నికల ఫలితాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆప్‌... ఆశించినట్లుగా ఫలితాలు రాకపోవడంతో ఢిల్లీలోని ఆప్‌ కార్యాలయం నిర్మానుష్యంగా మారింది.  మరోవైపు  ఫలితాలు తారుమారు కావడంతో ఆప్‌ అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసం వద్ద ఉదయం ఉంచిన ఆప్‌ ఎన్నికల గుర్తు ‘చీపుర్లు’ను  పార్టీ శ్రేణులు మధ్యాహ్నం వాటిని అక్కడ నుంచి తరలిస్తూ కెమెరా కంటికి చిక్కారు.

ఇక సత్తా చాటాలని ఉవ్విళ్లూరిన ఆమ్ ఆద్మీ పార్టీని పంజాబీ ఓటర్లు తగు రీతిన గౌరవించారనే చెప్పాలి. ఏళ్లుగా నమ్ముకున్న అకాలీదళ్‌ కంటే ఆమ్‌ ఆద్మీ పార్టీకే ఎక్కువ స్థానాలు కట్టబెట్టారు. ఆప్‌  పంజాబ్‌ సీఎం అభ్యర్థి భగవంత్‌ మాన్‌ జలాలాబాద్‌లో ఓటమి పాలయ్యారు. అక్కడి అకాలీదళ్‌ అధ్యక్షుడు, ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా ఉన్న సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ను ఆదరించారు.

>
మరిన్ని వార్తలు