వివాదాస్పదంగా పంజాబ్‌ ప్రభుత్వ నిర్ణయం

20 Jun, 2020 08:57 IST|Sakshi

ప్రభుత్వ ఉపాధ్యాయులతో ఇసుక మాఫియాపై నిఘా

చంఢీగఢ్: ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేందుకు 40 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను కపుర్తాలా జిల్లాలోని ఫగ్వారా చెక్‌పోస్టుల వద్ద కాపలాగా ఉంచనున్నట్లు పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదంగా మారింది. ఫగ్వారా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, సివిల్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాధికారులు, కమ్యూనికేషన్ ఎక్సెంజ్‌లతో పాటు ఉపాధ్యాయులు కూడా రాత్రి 9 గంటల నుంచి 1 గంటల మధ్య చెక్ పాయింట్ల వద్ద డ్యూటీ చేయాలంటూ శుక్రవారం ఉత్తర్వు జారీ చేసింది. ఇప్పటికే గురుదాస్‌పూర్‌ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం 24 మంది పాఠశాల ఉపాధ్యాయులను డిస్టిలరీలకు కాపాలాగా నియమించింది. కానీ దీనిని ఉపసంహరించిన నెల రోజులకే ప్రభుత్వం మరోసారి ఈ ఉత్తర్వును జారీ చేసింది. (వెంటిలేటర్‌ ప్లగ్‌ తీసి కూలర్‌ పెట్టారు)

దీనిపై శిరోమణి అకాలీదళ్‌(ఎస్‌ఎడీ) పార్టీ ప్రతినిధి, మాజీ మంత్రి డల్జిత్ సింగ్ చీమా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ‘డిస్టిలరీల తరువాత ఇసుక తవ్వకాలను ఆపడానికి పంజాబ్ ప్రభుత్వం వివిధ పోలీసు చెక్‌పోస్టు వద్ద ప్రభుత్వ ఉపాధ్యాయులను నియమించింది. ఉపాధ్యాయులను మద్యం, ఇసుక మాఫియా కోసం ఎందుకు నియమిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇది ఒక సిగ్గుమాలిన నిర్ణయం. ప్రభుత్వం వెంటనే దీనిని ఉపసంహరించుకోవాలి’’ అని డిమాండ్‌ చేశారు. కాగా గత నెలలో గురుదాస్‌పూర్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం జారీ చేసిన ఈ వివాదాస్పద ఉత్తర్వుపై ప్రభుత్వం ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంది. మద్యం సరఫరాపై నిఘా పెట్టడానికి 24 మంది ఉపాధ్యాయులను కర్మాగారాల్లో మోహరించింది. అయితే ప్రతిపక్షం ఆందోళనలతో ఆ ఉత్తర్వును ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. (ఎగువసభ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ క్లీన్‌ స్వీప్‌)

మరిన్ని వార్తలు