‘అయోధ్యపై నివేదికను పీవీ తిరస్కరించారు’

4 Nov, 2019 05:31 IST|Sakshi

న్యూఢిల్లీ: అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేసే సమయంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు చాకచక్యంగా వ్యవహరించి ఉంటే మసీదు కూల్చివేత ఉండేది కాదని అప్పటి హోంశాఖ కార్యదర్శి మాధవ్‌ గాడ్బొలే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మసీదు కూల్చివేతకు ముందు హోంమంత్రిత్వ శాఖ రూపొందించిన నివేదికను పీవీ తిరస్కరించారని పేర్కొన్నారు. ‘ప్రధాని పదవిలో ఉన్న పీవీ.. రాజకీయ చొరవ తీసుకుని ఉంటే ఆ సంఘటన జరగకుండా ఉండేది’అని అయోధ్య వివాదంపై గాడ్బొలే రాసిన ‘ది బాబ్రీ మసీద్‌–రామ మందిర్‌ డైలెమా: ఆన్‌ యాసిడ్‌ టెస్ట్‌ ఫర్‌ ఇండియాస్‌ కాన్‌స్టిట్యూషన్‌’అనే కొత్త పుస్తకంలో వెల్లడించారు. ఈ వివాదాస్పద కూల్చివేతకు ముందు తర్వాత సంఘటనలను ఆయన ఈ పుస్తకంలో పొందుపరిచారు. ప్రధాని పీవీ ఆ సమయంలో అత్యంత కీలక పాత్ర పోషించారని, అయితే దురదృష్టవశాత్తు ఆయనొక అసమర్థ కెప్టెన్‌గా మిగిలిపోయారని విమర్శించారు. గతంలో ప్రధాన మంత్రులుగా పనిచేసిన రాజీవ్‌ గాంధీ గానీ, వీపీ సింగ్‌ గానీ ఈ వివాద పరిష్కారంలో తమ సరైన వైఖరిని తెలియజేయలేదన్నారు.

మరిన్ని వార్తలు