బాత్రూమ్‌లో ఐద‌డుగుల కొండ‌చిలువ‌

23 Jul, 2020 08:07 IST|Sakshi

న్యూఢిల్లీ: బాత్రూమ్‌లో కొండ‌చిలువ క‌నిపించ‌డంతో ఓ కుటుంబం షాక్ తిన్న ఘ‌ట‌న న్యూఢిల్లీలోని ఓక్ల‌హాలో చోటు చేసుకుంది. భారీ వ‌ర్షాల‌కు ఓ కుటుంబం ఇంట్లోకి, స‌రాస‌రి బాత్రూమ్‌లోకి ఐద‌డుగుల కొండ‌చిలువ వ‌చ్చి చేరింది. దీంతో భ‌యాందోళ‌న‌ల‌కు గురైన కుటుంబ స‌భ్యులు వెంటనే వైల్డ్‌లైఫ్ ఎస్ఓఎస్ అనే ఎన్జీవోను సంప్ర‌దించి వారికి స‌మాచారం అందించారు. దీంతో వెంట‌నే వారు సిబ్బందితో సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని బాత్రూమ్‌లో న‌క్కిన కొండ‌చిలువ‌ను ప‌ట్టుకున్నారు. అయితే అది అనారోగ్యంతో ఉన్నందువ‌ల్ల అబ్జ‌ర్వేష‌న్‌లో పెట్టిన‌ట్లు ఎన్‌జీవో ప్ర‌తినిధులు తెలిపారు. వ‌ర్షాల వ‌ల్ల పాములు త‌ర‌చూ ఇళ్ల‌లోకి వ‌స్తున్నాయ‌ని వైల్డ్‌లైఫ్ ఎస్ఓఎస్ ప్ర‌తినిధి వ‌సీమ్ అక్ర‌మ్ పేర్కొన్నారు. వ‌ర్ష‌పు నీరు వాటి ఆవాసాల్లోకి ప్ర‌వేశించిన‌ప్పుడు ర‌క్ష‌ణ కోసం పొడిగా ఉండే ప్రాంతాన్ని వెతుకుతూ, అనుకోకుండా గృహ స‌ముదాయాల్లోకి చేరుతాయ‌ని తెలిపారు. (నిజంగా ఇది నమ్మశక్యం కాని విషయం)


ఫొటో(ఏఎన్ఐ సౌజ‌న్యంతో)
పొడ‌వైన నాగుపామును ర‌క్షించిన అధికారులు
ఒడిశాలోని బురుఝ‌రి గ్రామంలో భారీ నాగుపాము బావిలో చిక్కుకుపోయింది. దీన్ని గ‌మ‌నించిన స్థానికులు వెంట‌నే అట‌వీ అధికారుల‌కు స‌మాచారం అందించారు. దీంతో వారు స్నేక్ హెల్ప్‌లైన్ టీమ్‌ను ఆ ప్రాంతానికి పంపించారు. వారు సుమారు గంట‌పాటు క‌ష్ట‌ప‌డి ఎట్ట‌కేల‌కు దాన్ని బ‌య‌ట‌కు తీశారు. నాగుపాము పొడ‌వు 12-15 అడుగులుగా ఉంది. అనంత‌రం దీన్ని అడ‌విలో వ‌దిలిపెట్టారు. (ఒకేలా ఉండ‌ట‌మే కాదు ఫ‌లితాలు కూడా ఒక‌టే!)

మరిన్ని వార్తలు