'జాట్లు పెద్ద వ్యూహమే పన్నారు'

22 Feb, 2016 09:47 IST|Sakshi
'జాట్లు పెద్ద వ్యూహమే పన్నారు'

ఝాజర్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జాట్ల ఉద్యమం పేరుకే రిజర్వేషన్ల డిమాండ్ ఉద్యమం అని దాని వెనుక భారీ వ్యూహం ఉందని తెలుస్తోంది. తమ జాతికి చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి పీఠాన్ని అలంకరించాలనేది వారి తదుపరి డిమాండ్ అని, దానికి ముందస్తు కసరత్తుగానే ఈ ఉద్యమం చేస్తున్నారని తెలిసింది. ఝాజర్ టౌన్లో ఆందోళనలు చేస్తున్న జాట్లు 'రావ్ తులా రామ్' విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో ఆ గొడవ కాస్త జాట్ వర్సెస్ జాట్ లేతరుల మధ్యకు మళ్లింది.

ఎందుకంటే రామ్ తులా రామ్ యాదవులకు చెందిన శక్తిమంతమైన తిరుగులేని నేత. పైగా యాదవులను అక్కడ ఓబీసీలుగా గుర్తించారు. ఇలా చేయడం జాట్ లకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ముందు రిజర్వేషన్ల పేరుతో ఉద్యమాన్ని లేవదీసి.. తర్వాత ముఖ్యమంత్రి స్థానం కోసం మరోసారి రోడ్లెక్కాలన్నది వారి అసలైన లక్ష్యంగా కనిపిస్తోంది. ఇదే అంశాన్ని కొందరు యాదవులు స్వయంగా చర్చించుకుంటున్నారు. జాట్ ల వ్యూహాన్ని వారు పసిగట్టారు. ఒక వేళ నిజంగా అదే అంశం తెరపైకి వస్తే ఎలాంటి పరిస్థితులు సంభవిస్తాయో ఎదురుచూడాల్సిందే.

మరిన్ని వార్తలు