కేంద్రీయ వర్సిటీల్లో కోటా తప్పనిసరి

6 Jun, 2016 01:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అడ్మిషన్లు, ఉద్యోగాల నియామకాల్లో రిజర్వేషన్ విధానం తప్పనిసరిగా అమలు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. అన్ని కోర్సులలో అడ్మిషన్లకు కేంద్రీయ విద్యా సంస్థలు(అడ్మిషన్లలో రిజర్వేషన్లు) చట్టం-2006 అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయాలని వర్సిటీల రిజిస్ట్రార్లకు లేఖలు రాసింది.

బోధనేతర సిబ్బంది నియామకాల్లో గ్రూప్ ‘ఏ’, గ్రూప్ ‘బి’ పోస్ట్‌లలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ప్రత్యక్ష నియామకాల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని స్పష్టం చేసింది. అలాగే, ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అయితే బోధనా సిబ్బంది నియామకాల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లను అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మాత్రమే అమలు చేయాలని పేర్కొంది.

మరిన్ని వార్తలు