షెల్టర్‌ షేమ్‌ : నితీష్‌ రాజీనామాకు రబ్రీ డిమాండ్‌

10 Aug, 2018 18:37 IST|Sakshi
బిహార్‌ మాజీ సీఎం రబ్రీ దేవి (ఫైల్‌ ఫోటో)

పట్నా : ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ హోంలో చిన్నారులపై అకృత్యాల ఘటనపై బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ తక్షణమే రాజీనామా చేయాలని మాజీ సీఎం రబ్రీ దేవి డిమాండ్‌ చేశారు. నితీష్‌ సీఎం పదవిలో కొనసాగినంత కాలం నిష్పాక్షిక విచారణ సాధ్యం కాదని తేల్చిచెప్పారు. సీబీఐ ప్రస్తుతం కేసును విచారిస్తున్నా ఇంతవరకూ పెద్ద తలకాయలు ఎవరూ పట్టుబడలేదని, నితీష్‌ అధికారంలో ఉంటే కేసులో ప్రమేయం ఉన్న రాజకీయ నేతలు, అధికారుల పేర్లు వెలుగుచూడవని తాము భావిస్తున్నామన్నారు.

ముజఫర్‌పూర్‌ దారుణ ఘటనలో జేడీయూ, బీజేపీ నేతల హస్తం ఉందని నితీష్‌ అంతరాత్మకు తెలుసని రబ్రీ దేవి ఆరోపించారు. ఈ కేసులో సీబీఐ నిష్పాక్షిక విచారణపై ఆమె సందేహం వ్యక్తం చేశారు. ముజఫర్‌పూర్‌ ఘటన బిహార్‌తో పాటు నితీష్‌ ప్రతిష్టను మంటగలిపిందని అన్నారు. మహిళలు, బాలికలకు బిహార్‌ సురక్షితం కాదని ఆందోళన వ్యక్తం చేశారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మరో రూ. 5 కోట్లు 

రత్న భాండాగారం తెరవాలి

యూపీ సీఎంకు సుప్రీం షాక్‌

కేరళ: చిన్నారి సాయం, బంపర్‌ ఆఫర్‌

కేరళకు వైఎస్‌ జగన్‌ ఆపన్నహస్తం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అనాథ చిన్నారులతో చిందేసిన ప్రియాంక

వరద బాధితుల్లో నటి కుటుంబం

ఓవర్సీస్‌లోనూ దుమ్ము దులుపుతున్నాడు!

‘సైరా’ టీజర్‌ రెడీ!

ఆసక్తికరంగా ‘వీర భోగ వసంత రాయలు’ టీజర్‌

అది వేరే లెవల్‌