కూర్చీ ఖాళీగా ఉందని కూర్చున్నా..

6 Oct, 2017 15:55 IST|Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఓ పోలీసు స్టేషన్‌ హౌస్‌ అధికారి(ఎస్‌హెచ్‌ఓ) కుర్చీలో సాధ్వా రాధేమా కూర్చున్న సంఘటన వివాదస్పదమైన సంగతి తెలిసిందే. రాధేమా ఆయన కుర్చీలో కూర్చోవడంతో నిజంగా ఆయన పదవి నుంచే సస్పెండ్‌ అయిపోయారు. ఈ సంఘటనపై రాధేమా స్పందించారు. బాత్‌రూం వాడుకోవడానికి తాను పోలీస్‌ స్టేషన్‌లోకి వెళ్లానని, అక్కడ ఓ కూర్చీ ఖాళీగా ఉంటే దానిలో కూర్చున్నానని, అది ఎస్‌హెచ్‌ఓ సీటని తనకి తెలియదని రాధేమా చెప్పారు. తన కూర్చీలో నుంచి లేవాల్సిందిగా ఎస్‌హెచ్‌ఓ తనను అభ్యర్థించినట్టు పేర్కొన్నారు.

తాను వెంటనే ఆ కూర్చీలో నుంచి లేచానని చెప్పారు. ఆ సమయంలో తీసిన ఫోటో ఇలా చర్చనీయాంశమైందని తెలిపారు. ఎస్‌హెచ్‌ఓకు తానెవరో కూడా తెలియనది, ఢిల్లీ పోలీసును అగౌరవపరిచే ఉద్దేశ్యం తనకు లేదని సమర్థించుకున్నారు. రిపోర్టుల ప్రకారం స్థానిక వివేక్‌ విహార్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన రాధేమా, స్టేషన్‌ హౌస్‌ అధికారి కూర్చీలో కూర్చున్నారు. ఆమె పక్కనే ఎస్‌హెచ్‌ఓ సంజయ్‌ శర్మ మెడలో ఎర్రటి శాలువాతో చేతులు కట్టుకుని నిలబడి ఉన్న ఫోటో వెలుగులోకి వచ్చింది. 

మరిన్ని వార్తలు