రేడియో పరిశ్రమను ప్రభుత్వమే ఆదుకోవాలి

28 May, 2020 16:55 IST|Sakshi

న్యూఢిల్లీ: కోరోనా దెబ్బకు అన్ని రంగాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో రేడియో పరిశ్రమ ప్రతినిధులు సమస్యలను ప్రభుత్వానికి నివేదించారు.  రేడియో ఆపరేటర్స్‌ ఆఫ్ ఇండియా, ఎఫ్‌ఎమ్‌ చానెల్స్‌ ప్రతినిధులు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర సమాచార మంత్రి ప్రకాష్‌ జవదేకర్కు‌ లేఖలో వివరించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన అన్ని రకాల ఫీజులను సంవత్సరం పాటు మినహాయించాలని లేఖలో ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ లేఖపై సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన  లైసెన్స్ ఫీజులను వడ్డీ లేకుండా మూడు నెలలు పొడిగించనున్నట్లు తెలిపింది.

కోరోనా కారణంగా రేడియా పరిశ్రమ ఏప్రిల్‌లో 80శాతం నష్టపోగా.. మే నెలలో 90శాతం నష్టపోయిందని ప్రతినిధులు వాపోయారు. లక్షలాది మందికి ఉపాధి కల్సిస్తున్న రంగంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం పరిశ్రమ 200కోట్ల నష్టాలను చవిచూసిందని.. సెప్టెంబర్‌ నాటికి 600 కోట్లు నష్టపోయే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

చదవండి: జ‌ర్న‌లిస్టులు జాగ్ర‌త్త‌లు పాటించాలి : కేంద్ర మంత్రి

>
మరిన్ని వార్తలు