విమానాశ్రయంలో రేడియోయాక్టీవ్ లీక్ కలకలం

9 Oct, 2016 15:59 IST|Sakshi
విమానాశ్రయంలో రేడియోయాక్టీవ్ లీక్ కలకలం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కార్గో టెర్మినల్ వద్ద రేడియోయాక్టీవ్ పదార్థం లీక్ కావడం ఆదివారం కలకలం సృష్టించింది. విమానాశ్రయ సిబ్బంది సమాచారం మేరకు అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్(ఏఈఆర్బీ) అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎయిర్ ఫ్రాన్స్ విమానం ద్వారా వచ్చిన మెడికల్ పార్సిల్లో ఈ లీక్ సంభవించినట్లు అధికారులు గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యగా కార్గో టెర్మినల్ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. 
 
లీక్ అయిన రేడియోయాక్టీవ్ పదార్థం క్యాన్సర్ చికిత్సలో వాడే న్యూక్లియర్ మెడిసిన్కు సంబంధించినది అని, అయితే దీని రేడియోయాక్టివ్ తీవ్రత చాలా తక్కువ అని ఏఈఆర్బీ అధికారులు తనిఖీల అనంతరం వెల్లడించారు. జాతీయ విపత్తు నిర్వహన సంస్థ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఎలాంటి హానిలేదని తెలిపారు.
 
>
మరిన్ని వార్తలు