దొంగిలించలేదు.. జిరాక్స్‌ తీశారంతే!

9 Mar, 2019 03:03 IST|Sakshi
అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌

రఫేల్‌ పత్రాలపై మాటమార్చిన అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌  

న్యూఢిల్లీ: భారత రక్షణశాఖ కార్యాలయం నుంచి రఫేల్‌ ఒప్పంద పత్రాలు దొంగతనానికి గురయ్యాయని చెప్పిన అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ మాటమార్చారు. రఫేల్‌ ఒప్పందానికి సంబంధించిన పత్రాల ఫొటోకాపీలను మాత్రమే తీసుకెళ్లారని, నిజమైన పత్రాలు రక్షణశాఖ ఆఫీసులోనే ఉన్నాయని చెప్పారు. ‘రక్షణశాఖ నుంచి రఫేల్‌ ఒప్పంద పత్రాలు అదృశ్యమయ్యాయని నేను సుప్రీంకోర్టుకు చెప్పినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని తెలిసింది. ఇది ఎంత మాత్రం నిజం కాదు.

యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌ శౌరీ, ప్రశాంత్‌ భూషణ్‌ దాఖలుచేసిన పిటిషన్‌కు రఫేల్‌ ఒప్పంద పత్రాల ఫొటోకాపీలను జతచేశారు’ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా స్పందిస్తూ..‘మోదీ ప్రభుత్వపు ఏజీకి రఫేల్‌ పత్రాల దొంగతనం, ఫొటోకాపీలకు మధ్య వ్యత్యాసం తెలియదు. భారత్‌ సురక్షితమైన చేతుల్లో ఉందని ఆ ప్రభుత్వమే ప్రజలకు హామీ ఇస్తోంది. మోదీజీ ఈ మోసం ఏంటి? ఇప్పటివరకూ అనితరసాధ్యమైన అబద్ధాలన్నీ ఇప్పుడు సుసాధ్యంగా కనిపిస్తున్నాయి’ అని ఎద్దేవా చేశారు. రాహుల్‌ గాంధీ, అబద్ధాలు పర్యాయపదాలని బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  పటేల్‌ విగ్రహం చైనాలో రూపొందించారంటూ రాహుల్‌ అబద్ధం చెప్పారన్నారు.

మరిన్ని వార్తలు