'అంతా ఓకే కానీ ఇప్పుడు కాదు'

24 Jan, 2016 15:25 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్కు రాఫెల్ యుద్ధ విమానాలను విక్రయించే ఒప్పందం సరైన దారిలోనే ముందుకుపోతుందని, అయితే ఇది ఈ పర్యటనలోనే పూర్తయ్యే విషయం కాదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ప్రకటించారు.  గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొనేందుకు ఆదివారం భారత్ చేరుకున్న ఆయన పీటీఐతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇరు దేశాల మధ్య రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పందం కీలకం కానుందని హోలండే తెలిపారు.

రాఫెల్ యుధ్దవిమానాల కొనుగోలుకు రూ 60 వేల కోట్లతో భారత్.. ఫ్రాన్స్తో ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తున్న విషయం తెలిసిందే. దీని ద్వారా 36 రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుండి భారత్ పొందనుంది. అయితే ఈ ఒప్పందం కుదుర్చుకోవడానికి  సాంకేతికపరమైన కారణాల నేపథ్యంలో మరికొంత కాలం ఆగక తప్పదని హోలండే తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు