ధైర్యముంటే చర్చకు రండి

26 Nov, 2016 01:37 IST|Sakshi

మోదీకి రాహుల్ సవాల్
న్యూఢిల్లీ/కోల్‌కతా: నోట్ల రద్దుపై ధైర్యముంటే చర్చకు రావాలని ప్రధాని మోదీకి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సవాలు విసిరారు. లోక్‌సభకు ప్రధాని రాకపోవడంపై స్పందిస్తూ... ఈ అంశంపై మాట్లాడటానికి మోదీ ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు రాజ్యసభలో ఆనంద్‌శర్మ మాట్లాడుతూ... నోట్ల రద్దు తదనంతరం జరిగిన పరిణామాలకు మోదీతో పాటు ఆర్‌బీఐ గవర్నర్ కూడా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కాగా, మోదీ  ఓ తుగ్లక్ అని సీపీఎం నేత సీతారాం ఏచూరి, మోదీ ఆరెస్సెస్ ప్రచారక్‌లా మాట్లాడుతున్నారని సీపీఐ నేత డి. రాజా విమర్శించారు.  మోదీ ఓ చెడ్డ రాజకీయ నాయకుడు అని, చెత్త పాలకుడు అని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ధ్వజమెత్తారు.  మండిపడ్డారు. ఆయన అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.

>
మరిన్ని వార్తలు