‘మోదీజీ.. ఇది సిగ్గుచేటు’

16 Apr, 2018 14:57 IST|Sakshi
రాహుల్‌ గాంధీ (ఫైల్‌ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : మైనర్‌ బాలికలపై లైంగిక దాడులు, వేధింపులు తీవ్రతరమవడంపై కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు. 2016లో 19,675 మం‍ది మైనర్‌ బాలికలపై లైంగిక దాడులు జరిగాయని, ఈ కేసులను త్వరితగతిన విచారించి దోషులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఒక్క ఏడాదిలోనే ఇంతమంది మైనర్లపై లైంగిక దాడి జరగడం సిగ్గుచేటని ప్రధాని మోదీకి చురకలు వేశారు.

చిన్నారులకు న్యాయం జరగాలని ప్రధాని కాంక్షిస్తే తక్షణమే ఈ కేసులపై విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని ట్వీట్‌ చేశారు. దేశవ్యాప్తంగా మైనర్‌ బాలికలు, మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, హింసాకాండపై ప్రధాని మోదీ మౌనంగా ఉండటాన్ని ఇటీవల రాహుల్‌ తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. యూపీలోని ఉన్నావ్‌ లైంగిక దాడి కేసును రాహుల్‌ ప్రస్తావిస్తూ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ను ప్రభుత్వం వెనకేసుకురావడాన్ని ఆక్షేపించారు. రేపిస్టులు, హంతకులకు ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు కొమ్ముకాస్తుందని నిలదీశారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శబరిమలను చూశా.. మళ్లీ వస్తానని మొక్కుకున్నా

ఉద్రిక్తంగానే శబరిమల

శబరిమల ఆలయ కమిటీ కీలక నిర్ణయం..!

ఘోర ప్రమాదం; 50 మందిపైగా మృతి

మేము ఓడిపోయే అవకాశాలే ఎక్కువ!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మూడోసారి మాస్‌!

ప్రేమ కథ పట్టాలెక్కింది

శ్వాస  మొదలైంది

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ను అడ్డుకునే ధైర్యం ఎవరికీ లేదు

ఆ కబురు  చెబుతారా?

ఉలగమ్‌ సుట్రుమ్‌ వాలిబన్‌