రాహుల్‌ గాంధీ హెలీకాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

18 Oct, 2019 22:13 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

దుమ్ము తుపాను కారణంగా ఘటన

పిల్లలతో సరదాగా క్రికెట్‌ ఆడిన రాహుల్‌

అనంతరం రోడ్డు మార్గాన ఢిల్లీకి పయనం

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ప్రయాణిస్తున్న హెలీకాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌ అయింది. హరియాణలోని మహెందర్‌ఘర్‌ ఎన్నికల సభలో పాల్గొన్న రాహుల్‌ ఢిల్లీకి తిరిగి వెళ్తున్న క్రమంలో ఈఘటన చోటుచేసుకుంది. ‘దట్టమైన దుమ్ము తుపాను కారణంగా హెలీకాప్టర్‌ రివారీలోని కేఎల్పీ కాలేజీ మైదానంలో అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. ఎలాంటి టెక్నికల్‌ సమస్యలు లేవు. అందరూ క్షేమం’అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక ఈ ఘటన అనంతరం రాహుల్‌ రోడ్డు మార్గాన ఢిల్లీ చేరుకన్నారు.
(చదవండి : రాహుల్‌ గాంధీ లండన్‌ వెళ్లి పోతారా?!)

కాసేపు క్రికెట్‌..
ప్రతికూల వాతావరణం కారణంగా చోపర్‌ను కాసేపు నిలిపివేశారు. కాలేజీ మైదానం కావడంతో అక్కడ రాహుల్‌ పిల్లలతో కాసేపు సరదాగా క్రికెట్‌ ఆడారు. దీనికి సంబంధించిన వీడియోను ఏఎన్‌ఐ వార్తా సంస్థ సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. ఇక ఈ నెల 21న హరియాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మాహేంద్రగర్‌ బీజేపీ తరపున రామ్‌విలాస్‌శర్మ పోటీలో ఉన్నారు కాగా కాంగ్రెస్‌ తరపున రావు దాన్‌ సింగ్‌ బరిలో నిలిచారు. దుమ్ము తుపాను కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 60 విమానాలు 35 నిముషాల ఆలస్యంగా నడిచాయి.
 

మరిన్ని వార్తలు