ఇప్పటి వరకు జరిగింది చాలు..

17 Jun, 2020 11:16 IST|Sakshi

న్యూఢిల్లీ: తూర్పు లద్ధాఖ్‌లోని గాల్వన్‌ లోయలో భారత్‌, చైనా దళాల మధ్య జరిగిన హింసాత్మక ఘటనపై కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండటంతో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంతజరుగుతున్నా ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించారు. మన సైనికులను చంపడానికి వారికెంత ధైర్యం..? వారు మన భూమిని ఆక్రమించకోవడానికి అంత దుస్సాహసానికి ఒడిగడతారా..? ఇప్పటి వరకు జరిగింది చాలు.. అక్కడ ప్రస్తుతం ఏమి జరుగుతోందో తెలియాలంటూ రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. చదవండి: హింసాత్మక ఘటనపై స్పందించిన అమెరికా

కాగా.. చైనాతో పోరులో 20 మంది భారతీయ సైనికులు అమరులవడంపై కాంగ్రెస్‌ పార్టీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సైనికుల వీరమరణం తనకు చాలా బాధను కలిగించిందని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఓ ప్రకటనలో తెలిపారు. దేశ భద్రత, ప్రాదేశిక సమగ్రత విషయంలో తామంతా కలిసికట్టుగా ఉంటామని ఆమె పేర్కొన్నారు. అయితే మంగళవారం రోజున చైనా దళాలతో జరిగిన హింసాత్మక ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు ప్రాణాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. (విషం చిమ్మిన చైనా..)

చదవండి: చైనా కంపెనీలు, ఉత్ప‌త్తులను నిషేధించాలి

మరిన్ని వార్తలు