‘పెట్రోల్‌ ధరలు రూ. 60 కంటే తగ్గించాల్సింది పోయి..’

11 Mar, 2020 12:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయంగా పెట్రోల్‌ ధరలు భారీగా తగ్గినా, వాటి ప్రభావం మన దేశంలో నామమాత్రంగానే ఉండటంపై  కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చడంపై దృష్టిపెట్టి, అంతర్జాతీయంగా ఆయిల్‌ ధరలు కుదేలై 35 శాతం కంటే తక్కువగా పడిపోయిన విషయాన్ని ప్రధాని గమనించలేకపోయారని ఎద్దేవా చేశారు. పెట్రోల్‌ ధరలను రూ.60 దిగువకి తగ్గించి, అంతర్జాతీయంగా తగ్గిన పెట్రోల్‌ ధరల ప్రభావాన్ని సామాన్య ప్రజలకు చేరేలా చేయలేరా అని ప్రశ్నించారు. పెట్రోల్‌ ధరలు తగ్గించి, మందగించిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని ప్రధానమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్‌ చేస్తూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.
 

మరిన్ని వార్తలు