మరోసారి మోదీని టార్గెట్‌ చేసిన రాహుల్‌ గాంధీ

20 Jul, 2020 18:12 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌-చైనా సరిహద్దు వివాదంలో కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి ప్ర‌ధాని నరేంద్ర మోదీపై విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికల ముందు మోదీ జనంలో తాను చాలా బలమైన నేతననే అభిప్రయాన్ని ఏర్పర్చరని అన్నారు. కానీ ఆ ఇమెజ్‌ నేడు భారత్‌కు అతి పెద్ద బలహీతగా మారిందని రాహుల్‌ ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ తన ట్విట్టర్‌లో ఈ రోజు ఓ వీడయోను పోస్ట్‌ చేశారు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో రాహుల్‌ మోదీని విమర్శించడమే కాక.. చైనా వక్ర బుద్ధిని దుయ్యబట్టారు. వీడియోలో రాహుల్‌ గాంధీ అధికారంలోకి వ‌చ్చేందుకు మోదీ తానో బ‌ల‌వంతుడిన‌న్న బూట‌క‌పు ఇమేజ్‌ను క్రియేట్ చేశార‌ని విమ‌ర్శించారు. కానీ ఇప్పుడు అది భార‌త్‌కు బ‌ల‌హీనంగా మారింద‌న్నారు. మోదీ ప్ర‌తిష్ట‌కు, చైనా ప్ర‌ణాళిక‌ల‌కు ఏ ర‌కంగా సంబంధం ఉంటుందో రాహుల్ త‌న వీడియోలో వివ‌రించారు. ('ఆ దాడి ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది')

యావ‌త్ భూమండ‌లాన్ని చేజిక్కించుకోవాల‌ని చైనా ఎత్తుగ‌డ‌లు వేస్తున్న‌ట్లు రాహుల్ త‌న వీడియోలో ఆరోపించారు.  ప్ర‌ణాళిక లేకుండా చైనీయులు ఏమీ చేయ‌ర‌ని, వారు త‌మ మ‌ధిలో ఓ ప్ర‌పంచాన్ని క్రియేట్ చేసుకున్నారన్నారు. దానికి త‌గిన‌ట్లుగా వాళ్లు ఆ ప్ర‌పంచాన్ని త‌యారు చేసుకుంటున్నారన్నారు రాహుల్. గ‌దార్, బెల్ట్ రోడ్ దానిలో భాగ‌మే అన్నారు. వాళ్లు పూర్తిగా భూగ్ర‌హాన్ని మార్చేస్తున్న‌ట్లు రాహుల్ విమ‌ర్శించారు. అయితే ఇలాంటి వ్యూహాత్మ‌క స‌మ‌యంలో.. కీల‌క‌మైన గల్వాన్‌, డెమ్చోక్‌, పాన్‌గాంగ్ స‌ర‌స్సుల వ‌ద్ద చైనా త‌న‌ ప్రాభ‌వాన్ని పెంచుకున్న‌ట్లు రాహుల్ తెలిపారు. మ‌న హైవేల వ‌ల్ల చైనీయులు ఇబ్బంది పడుతున్న‌ట్లు చెప్పారు. చైనా.. పాకిస్తాన్‌తో కలిసి క‌శ్మీర్‌లో హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తుందని రాహుల్‌ ఆరోపించారు. (మేడిన్‌ చైనా రామాయణం)
 

భార‌త్, చైనా మ‌ధ్య ఉన్న ఉద్రిక్త‌లు కేవ‌లం స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌గా చూడ‌రాద‌న్నారు రాహుల్‌. బోర్డర్ స‌మ‌స్య‌తో ప్ర‌ధాని మోదీపై ఒత్తిడి తెస్తున్నార‌ని, మోదీ ప్ర‌తిష్ట‌పై చైనీయులు దాడి చేస్తున్నార‌న్నారు రాహుల్. తాము చెప్పిన‌ట్లు చెప్ప‌కుంటే, మోదీ బ‌ల‌మైన నేత అన్న భావాన్ని రూపుమాపే విధంగా వ్యవహరిస్తామని చైనా మోదీని బెదిరిస్తుందని తెలిపారు. ప్రస్తుతం మోదీ త‌న ప్ర‌తిష్ట ప‌ట్ల ఆందోళ‌న చెందుతున్న‌ట్లు అర్థ‌మ‌వుతుంద‌న్నారు. చైనీయులు మ‌న భూభాగంలోకి ప్రవేశించారన్నారు రాహుల్‌. కానీ మోదీ మాత్రం మన దేశంలోకి ఎవరు రాలేదని అంటున్నారు. దీన్నిబట్టే మోదీ, చైనా ఒత్తిడికి తలొగ్గతున్నట్లు అర్థ‌మ‌వుతుందన్నారు. చైనా చెప్పిన‌ట్లు మోదీ వింటే, ఆయ‌న ఈ దేశానికి ప్ర‌ధాని కాదు అని రాహుల్ వీడియోలో విమర్శలు చేశారు.(మేక్‌ ఇన్‌ ఇండియా అంటూ చైనావే కొంటోంది)

మరిన్ని వార్తలు