మా పొత్తుతో మోదీ నవ్వు మాయం

21 Feb, 2017 02:06 IST|Sakshi
మా పొత్తుతో మోదీ నవ్వు మాయం

రాహుల్‌ గాంధీ వ్యాఖ్య
బందా(యూపీ): ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్‌ చేతులు కలపడంతో ప్రధాని మోదీ ముఖంలో నవ్వు మాయమైందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. మోదీ యూపీకి సొంత కొడుకు కాడని, దత్తపుత్రుడు మాత్రమేనని విమర్శించారు. ‘గంగామాత తన కొడుకు వారణాసికి పిలిపించుకుందని 2014లో మోదీ చెప్పారు.. మోదీజీ.. సంబంధాలనేవీ చెప్పుకుంటే కాదు పెంపొదించుకుంటే ఏర్పడతాయి’ అని అన్నారు. గత యూపీఏ ప్రభుత్వం రూ.7వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసిందని, మోదీకి మాత్రం ఆ ఉద్దేశం లేదని ఆరోపించారు.

మోదీపై ఈసీ చర్యలు తీసుకోవాలి:
న్యూఢిల్లీ: యూపీలో ప్రజల మధ్య చిచ్చుపెడుతూ, ఎన్నికల వాతావరణాన్ని  మోదీ కలుషితం చేస్తున్నారని, ఆయనపై ఎన్నికల సంఘం తగిన చర్య తీసుకోవాలని కాంగ్రెస్‌ కోరింది. ‘మోదీ ఎన్నికల సభల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు.. ఖబరిస్తాన్ ఉన్నప్పుడు శ్మశానం కూడా ఉండాలని ఆదివారం ఆయన అన్న మాటలు సమాజాన్ని విడగొట్టేవే. ఆయన మత ఉద్రిక్తతలు సృష్టించేందుకు యత్నించారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు’ అని పార్టీ ప్రతినిధి ఆనంద్‌ శర్మ  ఆరోపించారు.

>
మరిన్ని వార్తలు