అంబానీకి దోచిపెడతారు కానీ..

21 Feb, 2019 15:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి మోదీ సర్కార్‌పై కాంగ్రెస్‌ నిప్పులుచెరిగింది.  పుల్వామా ఉగ్రదాడిని రఫేల్‌ ఒప్పందంతో పోలుస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, అనిల్‌ అంబానీలు లక్ష్యంగా కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ ప్రవచించే నవ భారత్‌లో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణిస్తే వారికి అమరవీరుల హోదా ఇవ్వరు గానీ రూ 30,000 కోట్ల ప్రజాధనాన్ని అనిల్‌ అంబానీ తీసుకుంటారని రాహుల్‌ వ్యాఖ్యానించారు.

జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో ఈనెల 14న సీఆర్‌పీఎఫ్‌ వాహన శ్రేణిపై జరిగిన ఉగ్రవాద దాడిలో 44 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ దాడికి పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ ప్రకటించింది.

మరిన్ని వార్తలు