కు.ని. ఆపరేషన్లపై తప్పు కప్పిపుచ్చే యత్నం: రాహుల్ గాంధీ

16 Nov, 2014 04:32 IST|Sakshi
కు.ని. ఆపరేషన్లపై తప్పు కప్పిపుచ్చే యత్నం: రాహుల్ గాంధీ

బిలాస్‌పూర్:  కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల్లో మహిళల మరణాలకు సంబంధించి, ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆపరేషన్లు వికటించి అస్వస్థతతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధిత మహిళలను పరామర్శించిన అనంతరం రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడారు.
 
 శస్త్రచికిత్స శిబిరాల నిర్వహ ణలో తప్పిదాలకు, అవకతవలకు బాధ్యతను ఒప్పుకోవడానికి బదులుగా చత్తీస్‌గఢ్ ప్రభుత్వం తప్పును కప్పిపుచ్చుకునే ందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలకోసం వినియోగించిన మందులను తగులబెడుతున్నారని, సాక్ష్యాధారాలను ధ్వంసం చేస్తున్నారని అన్నారు.  మొత్తం వ్యవహారంపై క్షుణ్ణంగా దర్యాప్తు జరిపించాలన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు