కర్ర , కత్తి.. ఏదైనా.. రాహుల్‌.. హూహా..!

30 Oct, 2017 01:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. ఇన్నాళ్లూ మనకు తెలిసిన రాహుల్‌ వేరు.. ఇప్పుడు వేరు.. మార్షల్‌ ఆర్ట్స్‌లో రాహుల్‌కు మంచి నైపుణ్యం ఉందన్న విషయం వెల్లడైనప్పటి నుంచి సోషల్‌ మీడియాలో ఆయన ఫ్యాన్స్‌ సంఖ్య పెరిగిందట. జపాన్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఐకిడోలో తనకు బ్లాక్‌ బెల్ట్‌ ఉన్నట్లు ఇటీవల రాహుల్‌ తెలిపారు. అంతేనా.. కత్తి తిప్పడంలోనూ కర్రసాము చేయడంలోనూ రాహుల్‌ మేటి అని ఆయనకు మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చిన గురువు సెన్సె పరిటోస్‌ చెప్పారు.

‘2009లో తొలిసారిగా రాహుల్‌ గాంధీని కలిశాను. మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చాను. రాహుల్‌ తన ఇద్దరు స్నేహితులతో కలసి ఢిల్లీలోని తుగ్లక్‌ లేన్‌ హౌజ్‌లోఉన్న తన నివాసంలో ప్రాక్టీస్‌ చేసేవారు. ఆయన తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ, బావ వాద్రా అప్పుడప్పుడు వచ్చి చూసేవారు’ అని పేర్కొన్నారు. 2013లో జపాన్‌ నుంచి ఐకిడో మాస్టర్‌ భారత్‌ వచ్చినప్పుడు రాహుల్‌ సంబంధిత పరీక్షలో కూడా పాల్గొని  బ్లాక్‌ బెల్ట్‌ సాధించారని చెప్పారు. రాహుల్‌ లండన్‌లో ఉన్నప్పుడు బ్రెజిలియన్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ జీ–జిట్సు కూడా నేర్చుకున్నారని తెలిపారు. 

– సాక్షి, తెలంగాణ డెస్క్‌ 

మరిన్ని వార్తలు