‘9/11 ఓ అధ్యాయమైతే.. కోవిడ్‌-19 ఓ పుస్తకం’

27 May, 2020 11:51 IST|Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌-19 ప్రపంచ రూపురేఖలను మార్చేసిందంటున్నారు కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్‌ వ్యాప్తి రెండు రకాలుగా ఉంది. మొదటిది ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపితే.. రెండవది ప్రపంచ స్థితిగతులను మార్చేది. వైరస్‌ ప్రభావం ఎక్కువ ఉన్న ప్రదేశాలన్ని గ్లోబలైజేషన్‌కు ప్రధాన కేంద్రాలుగా భాసిల్లే ప్రాంతాలు. కరోనా తర్వాత ఓ కొత్త ప్రపంచాన్ని చూస్తాం. 9/11 దాడులను ప్రపంచం ఓ అధ్యాయంగా భావిస్తే.. ఇప్పుడు కోవిడ్‌-19ను ఓ పుస్తకంగా చూస్తుంది’ అన్నారు రాహుల్‌. అంతేకాక పెద్ద పట్టణ కేంద్రాలన్ని తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. మతాల వారిగా, ప్రాంతాల వారిగా, జాతుల వారిగా ఈ వ్యాధితో పోరాడలేమని ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది. ఈ బాధను భరించేందుకు మనం తయారవ్వాలని రాహుల్‌ సూచించారు. (‘ఇది అసంబద్ధం.. వారంతా భారతీయులు’)

కోవిడ్-19 సంక్షోభం గురించి రాహుల్‌​ గాంధీ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ కేర్ నిపుణుడు డాక్టర్ ఆశిష్ ఝాతో పాటు ఎపిడమాలజిస్ట్‌, స్వీడన్‌ కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ జోహన్ గీసెక్‌తో సంభాషించారు. ఈ క్రమంలో భారతదేశంలోని అత్యధిక ఉష్ణోగ్రత కరోనాను నివారించగలదా అని ఆశిష్‌ను ప్రశ్నించారు రాహుల్‌. దానికి తగిన ఆధారాలు లేవని స్పష్టం చేశారు ఆశిష్‌. ఎక్కువ సంఖ్యలో టెస్టులు చేయడం వల్ల మాత్రమే వైరస్‌ వ్యాప్తిని తగ్గించగలమని పేర్కొన్నారు. అంతేకాక భారతీయులు తీసుకునే బీసీజీ వ్యాక్సిన్‌ వల్ల మన దగ్గర తక్కువ కేసులు నమోదవుతున్నాయనే విషయాన్ని కూడా తాను సమర్ధించడం లేదన్నారు ఆశిష్‌. ఇందుకు తగిన ఆధారాలు కూడా లేవని స్పష్టం చేశారు.(‘ఆర్థిక ప్యాకేజీని పునఃపరిశీలించండి’)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు