సోనియా ప్రధాని కాకుండా రాహుల్ అడ్డుకున్నారు

30 Jul, 2014 20:43 IST|Sakshi
సోనియా ప్రధాని కాకుండా రాహుల్ అడ్డుకున్నారు

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2004 ఎన్నికల అనంతరం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని కాకుండా ఆమె కుమారుడు రాహుల్ గాంధీ అడ్డుపడ్డారని చెప్పారు. సోనియా ప్రధాని అయితే రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీలను ఉగ్రవాదులు హతమార్చినట్టుగా ఆమెను కూడా  చంపుతారేమోనని రాహుల్ బయపడ్డారని నట్వర్ సింగ్ వ్యాఖ్యానించారు. దీంతో ప్రధాని పదవిని చేపట్టరాదని రాహుల్ సోనియాకు ఖరాఖండిగా చెప్పారని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఆ సమావేశంలో మన్మోహన్ సింగ్, ప్రియాంక గాంధీ, సుమన్ దూబే ఉన్నారని నట్వర్ సింగ్ వెల్లడించారు. ఈ విషయంలో ఒక కుమారుడిగా రాహుల్ ఆవేదనను అర్థం చేసుకున్నానని, అతని అభిప్రాయాన్ని పూర్తిగా గౌరవిస్తున్నాని నట్వర్ సింగ్ అన్నారు. ఈ విషయాన్ని తన ఆత్మకథలో రాయవద్దంటూ ప్రియాంక గాంధీ ఇటీవల తనను కోరారని తెలిపారు.

మరిన్ని వార్తలు