కేరళ సీఎంకు రాహుల్‌ లేఖ

31 May, 2019 20:05 IST|Sakshi

తిరువనంతపురం : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అమేథీలో ఓడిపోగా.. వయనాడ్‌లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కేరళ నుంచి గెలిచిన తర్వాత తొలిసారి రాహుల్‌ గాంధీ నియోజకవర్గ సమస్యలపై స్పందించారు. ఈ నెల 25న వయనాడ్‌కు చెందిన ఓ రైతు అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంపై స్పందించిన రాహుల్‌ గాంధీ.. పూర్తి స్థాయి విచారణ జరిపి సదరు రైతు కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు లేఖ రాశారు. రైతు ఆత్మహత్య విషయం తనకు ఎంతో బాధ కల్గించిందని రాహుల్‌ లేఖలో పేర్కొన్నారు.

ఈ సమస్యను పట్టించుకోకుండా ఇలానే వదిలేస్తే.. త్వరలోనే మరింత మంది రైతులు ఇదే మార్గాన్ని ఎన్నుకుంటారని రాహుల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాక ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేందుకు కేరళ ప్రభుత్వం కృషి చేయాలని అందుకు తన పూర్తి మద్దతు ఉంటుందని రాహుల్‌ స్పష్టం చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు