కొత్త అధ్యక్షుడిని త్వరగా తేల్చండి : రాహుల్‌

3 Jul, 2019 14:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌గా కొనసాగేందుకు రాహుల్‌ గాంధీ నిరాకరించారు. అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగరాదని పార్టీ శ్రేణులు ఒత్తిడి తెచ్చినా ఆయన మెత్తబడలేదు. ప్రస్తుతం తాను పార్టీ అధ్యక్ష పదవిలో లేనని స్పష్టం చేశారు. నూతన అధ్యక్షుడి నియామకంపై పార్టీ సత్వరమే స్పందించాలని కోరారు. తాను ఇప్పటికే పార్టీ చీఫ్‌గా వైదొలిగానని, అధ్యక్ష పదవికి రాజీనామా చేశానని చెప్పారు.

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తక్షణమే సమావేశమై నూతన అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు పార్టీ అధ్యక్ష హోదాలో కొనసాగాలని పార్టీ క్షేత్ర స్ధాయి నేతల నుంచి, పార్టీ సీఎంల వరకూ రాహుల్‌పై ఒత్తిడి తీసుకువచ్చినా రాహుల్‌ గాంధీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. పార్టీ నేతలు రాజీనామాలు సమర్పించినా తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించడంతో కాంగ్రెస్‌ పార్టీ నూతన చీఫ్‌ ఎంపిక ప్రక్రియను చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది.

మరిన్ని వార్తలు