ఆ రైళ్లలో భోజనం ధరలు పెంపు

16 Nov, 2019 06:06 IST|Sakshi

శతాబ్ది, రాజధాని, దురంతో రైళ్లలో..

న్యూఢిల్లీ: శతాబ్ది, రాజధాని, దురంతో రైళ్లలో ప్రయాణీకులకు అందించే టీ, టిఫిన్, భోజనం ధరలను పెంచాలని రైల్వే బోర్డు నిర్ణయించింది.  ఈ మూడు రైళ్లలో మీల్స్‌ ధరలు పెరిగిన నేపథ్యంలో వాటి టికెట్‌ ధరలలో సైతం స్వల్ప మార్పులు చోటుచేసుకోనున్నాయి. వీటిల్లో ప్రయాణించే వారు మీల్స్‌ను ఎంపిక చేసుకున్న నేపథ్యంలో వారి టికెట్‌ ధరలపై 3 నుంచి 9 శాతం వరకు పెరుగుదల ఉండనుంది. పెరిగిన కేటరింగ్‌ చార్జీలు వచ్చే ఏడాది మార్చి 29 నుంచి అమల్లోకి వస్తాయని రైల్వే బోర్డు పేర్కొంది.

తాజా ఉత్తర్వుల ప్రకారం ఈ మూడు రైళ్లలో ఫస్ట్‌ క్లాస్‌ ఏసీ, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌లలో టీ ధర రూ.15 నుంచి రూ.35కి, బ్రేక్‌ఫాస్ట్‌ ధర రూ.90 నుంచి రూ.140కి, లంచ్, డిన్నర్‌ ధరలు రూ.140 నుంచి రూ.245కి పెరగనున్నాయి. సెకండ్‌ క్లాస్‌ ఏసీ, థర్డ్‌ క్లాస్‌ ఏసీ, చైర్‌ కార్‌లలో ఉదయం టీ ధర రూ.10 నుంచి రూ.20కి, సాయంత్రం టీ ధర రూ.45 నుంచి రూ.90కి, బ్రేక్‌ఫాస్ట్‌ ధర రూ.70 నుంచి రూ.105కి. లంచ్, డిన్నర్‌ ధరలు రూ.120 నుంచి రూ.185కి పెరగనున్నాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు