2019కి ‘వ్యాగన్‌ పిరియాడికల్‌’ పూర్తి

8 Feb, 2017 00:46 IST|Sakshi
2019కి ‘వ్యాగన్‌ పిరియాడికల్‌’ పూర్తి

డిప్యూటీ సీఎం కడియంకు రైల్వే బోర్డ్‌ మెంబర్‌ గుప్తా హామీ

సాక్షి, న్యూఢిల్లీ: కాజిపేట్‌లో వ్యాగన్‌ పిరియా డికల్‌ ఓవరాలింగ్‌ యూనిట్‌ను 2019 మార్చి నాటికి పూర్తి చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి రైల్వే బోర్డు మెంబర్‌ రవీంద్ర గుప్తా హామీ ఇచ్చారు. మంగళవారం ఈ మేరకు కడియం, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతి నిధులు రామచంద్ర తేజోవత్, వేణుగోపాల చారి, ఎంపీ సీతారాం నాయక్‌ తదితరులు రవీంద్ర గుప్తాతో సమావేశమై రాష్ట్రంలోని వివిధ రైల్వే డిమాండ్లపై చర్చించారు. అలాగే కాజీపేటలో వ్యాగన్‌ పిరియాడికల్‌ ఓవరాలింగ్‌ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్రం తరఫున 160 ఎకరాల కేటాయింపునకు సంబంధిం చిన ఉత్తర్వులను ఆయనకు అందించారు. 

గుప్తా స్పందిస్తూ.. రూ.300 కోట్ల నిధులతో 2019 మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌కు పెరుగు తున్న రైల్వే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి వద్ద మూడో టెర్మినల్‌ను ఏర్పా టు చేయాలని కోరినట్టు కడియం తెలిపారు. చర్లపల్లి వద్ద కేంద్ర ప్రభు త్వానికి చెందిన భూమి ఉందని, అందులో 250 ఎకరాలను టెర్మినల్‌ ఏర్పాటుకు రైల్వేకు ఇవ్వాలని ఇప్పటికే కోరామన్నారు. ఇల్లం దుకు సింగరేణి ప్యాసింజర్‌ రైలును పునః ప్రారంభించాలని కోరినట్టు ఎంపీ సీతారాం నాయక్‌ తెలిపారు. పాండురంగపురం– సారపాకకు మధ్య 13 కిలోమీటర్ల ట్రాక్‌ వేస్తే భద్రాచలం దేవాలయానికి దేశవ్యాప్తంగా ప్రజలు రావడానికి అవకాశం ఉంటుందని వివరించినట్టు చెప్పారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని గుప్తా హామీ ఇచ్చారని తెలిపారు.

మరిన్ని వార్తలు