ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్ల ఆదాయం 140 కోట్లు

27 Jul, 2019 08:51 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్ల అమ్మకాల ద్వారా భారతీయ రైల్వేకి 2018–19 సంవత్సరంలో రూ.140 కోట్ల ఆదాయం చేకూరింది. ఈ విషయాన్ని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ శుక్రవారం పార్లమెంటులో ప్రకటించారు. ప్రకటనల ద్వారా రూ. 230.47 కోట్ల ఆదాయం చేకూరిందని చెప్పారు. ‘‘ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం ఓపెన్‌ బిడ్‌ల ద్వారా రైల్వే స్టేషన్‌లోని దుకాణాలు, ప్రకటనల కోసం కాంట్రాక్టుకు ఇస్తాము. ఈ బిడ్ల ద్వారానే రేట్లు నిర్ణయిస్తారు. కనుక వీటి నిర్ధిష్టమైన రేటును చెప్పడం సరి కాదని మంత్రి స్పష్టం చేశారు. మొదటగా లైసెన్సు రుసుముగా కనీస ధరను నిర్ణయిస్తారు, ఆ తరువాత బిడ్డింగ్‌ జరుగుతుంది, దాని పైన కొటేషన్‌ ధరను సమర్పించాల్సి ఉంటుంది’’ అని గోయల్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు