రైల్వే రాబడి పెరిగింది

8 Apr, 2015 14:20 IST|Sakshi
రైల్వే రాబడి పెరిగింది

న్యూఢిల్లీ: ఈయేడాది కూడా రైల్వే ఆదాయం పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే 2014-15 ఆర్థిక సంవత్సరానికి 12.16శాతం ఆదాయం పెరిగినట్లు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ గణాంకాలు తెలిపాయి. 2013-14 సంవత్సరంలో రైల్వే ఆదాయం రూ.140,761.27 కోట్లుకాగా, ఈ 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.1,57,880.50 కోట్ల ఆదాయం లభించింది.

ఈ ఆదాయంలో సరుకు రవాణా రైళ్ల ద్వారా వచ్చింది రూ.1,07,074.79 ఉండగా.. గతంలో ఇదే గూడ్స్ సర్వీస్పై రూ.94,955.89 కోట్ల రాబడి వచ్చింది. ఇది 12.76శాతం ఎక్కువ. ఇక ప్రయాణీకుల సర్వీసు ద్వారా కూడా గతంలో కన్నా ఎక్కువ ఆదాయమే వచ్చింది. 2014-15లో మొత్తం 42,866.33కోట్ల ఆదాయం రాగా.. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.37,478.34 కోట్ల ఆదాయంగా ఉంది.  ఇది గతంతో పోలిస్తే 14.38శాతం ఎక్కువ.

మరిన్ని వార్తలు