రెల్వే రన్నింగ్‌ స్టాఫ్‌ అలవెన్స్‌ పెంపు

30 May, 2019 07:59 IST|Sakshi

న్యూఢిల్లీ: రైల్వేలో రన్నింగ్‌ స్టాఫ్‌ (రైలుతోపాటు వెళ్లే ఉద్యోగులు) అయిన లోకో పైలట్లు, గార్డులకు ఇచ్చే రన్నింగ్‌ అలవెన్స్‌ను రెండింతలకు పైగా పెంచినట్లు సీనియర్‌ అధికారి బుధవారం చెప్పారు. రైలు డ్రైవర్లు (లోకో పైలట్‌), గార్డులకు రన్నింగ్‌ అలవెన్స్‌ను పెంచాలంటూ ఎన్నో ఏళ్లుగా డిమాండ్‌ ఉంది. ఇప్పటివరకు ప్రతి 100 కిలో మీటర్లకు వారికి 253.5 రూపాయలు చెల్లిస్తుండగా, ఇక నుంచి ఆ మొత్తం రూ. 525కి పెరిగింది. లోకో పైలట్లు, గార్డులు తరచుగా తమ ప్రధాన కార్యాలయానికి, కుటుంబానికి చాలా దూరంగా వెళ్లి, పని చేయాల్సి వస్తుంటుంది. వాళ్లు తిరిగిరావడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది.

7వ వేతన సంఘం సిఫార్సులను అనుసరించి మిగతా వర్గాల ఉద్యోగులకు అలవెన్స్‌లను 2016లోనే పెంచినప్పటికీ, రన్నింగ్‌ స్టాఫ్‌ అలవెన్స్‌ను మాత్రం ఇన్నాళ్లూ పెండింగ్‌లో పెట్టారు. ప్రస్తుతం రైల్వేలో దాదాపు 1.2 లక్షల మంది ఉద్యోగులు రన్నింగ్‌ స్టాఫ్‌గా పనిచేస్తున్నారు.  

మరిన్ని వార్తలు