రైల్వే క్లాక్‌రూమ్, లాకర్ల ఫీజు పెంపు!

15 Jan, 2018 03:42 IST|Sakshi

న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులు లగేజీని భద్రపరచుకునే క్లాక్‌రూములు, లాకర్ల ఫీజులను పెంచేందుకు రైల్వేశాఖ అంగీకరించింది. ఫీజుల్ని పెంచే అధికారాన్ని డివిజినల్‌ రైల్వే మేనేజర్ల(డీఆర్‌ఎం)కు కట్టబెట్టింది. ఈ సేవల ఆధునీకరణకు త్వరలో బిడ్లు ఆహ్వానించనున్నట్లు రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఈ కొత్త విధానంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఫీజుల్ని పెంచే అధికారం డీఆర్‌ఎంలకు ఉంటుంది. లగేజీని గరిష్టంగా నెలరోజుల పాటు భద్రపరుస్తామని, కొత్త విధానాన్ని తొలుత ‘ఏ’ క్లాస్‌ రైల్వే స్టేషన్లలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం 24 గంటల పాటు వస్తువుల్ని భద్రపరిచేందుకు క్లాక్‌ రూమ్‌కు రూ.15, లాకర్‌కు రూ.20 వసూలు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు