'ఇక రైలు డ్రైవర్ల హలో.. హలోకు స్పీడ్ బ్రేక్'

18 Nov, 2015 20:06 IST|Sakshi

న్యూఢిల్లీ: భారతీయ రైల్వే వ్యవస్థలో భద్రతా ప్రమాణాలు పెంచే చర్యల్లో భాగంగా ఓ వినూత్న కార్యక్రమానికి భారతీయ రైల్వే తెరతీసింది. ఇక నుంచి తమ సంస్థలో పనిచేస్తున్న లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్ల ఫోన్ కాల్ రికార్డుల వివరాలు పరిశీలించనుంది. రైలు నడుపుతున్న సమయంలో ఫోన్లు వాడుతున్నారా లేదా అనే అంశం తెలుసుకునేందుకు కాల్ డేటాను సేకరించనుంది.

ఇందుకోసం ఇక నుంచి రైల్వేలో పని చేస్తున్న మొత్తం లోకో పైలెట్లకు, అసిస్టెంట్ లోకో పైలెట్లకు తామే సీయూజీ సిమ్ కార్డులను అందించడమే కాకుండా ప్రత్యేక నెంబర్లు కేటాయించి వారి కాల్ డేటాను పరిశీలించనుంది. ఈ మేరకు రైల్వేశాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు. రైల్వే నిబంధనల ప్రకారం రైలు నడుపుతున్నప్పుడు రైలు డ్రైవర్లు తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం 70 వేలమంది రైలు డ్రైవర్లు ఉన్నారు.

మరిన్ని వార్తలు