'పుర్రెలు, ఎముకలతో జంతర్‌మంతర్‌కు..'

18 Jul, 2017 18:52 IST|Sakshi
'పుర్రెలు, ఎముకలతో జంతర్‌మంతర్‌కు..'

న్యూఢిల్లీ: తమిళనాడులు రైతులు పుర్రెలు, ఎముకలతో ఢిల్లీ బాటపట్టారు.. రుణమాఫీ కోసం, కరువు భృతికోసం ఈ ఏడాది ప్రారంభంలో దాదాపు 41 రోజులపాటు ఢిల్లీ నడిబొడ్డున సుదీర్ఘ ఆందోళనలు నిర్వహించి వెళ్లిన వారు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరినే ప్రదర్శించడంతో చేసేదేం లేక మరోసారి జంతర్‌మంతర్‌కు చేరారు. అయితే, గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మాత్రం ఎండా వాన పగలు రాత్రి అనే తేడా లేకుండా తమ సమస్య తీవ్రతను సమాజానికి తెలియజేస్తామని స్పష్టం చేస్తూ పుర్రెలు, ఎముకలతో దీక్షా స్థలికి చేరుకున్నారు.

'వానలు రానీ, ఎండలు కొట్టని మా ఉద్యమం మాత్రం ఈసారి ఆగదు' అని అని నేషనల్‌ సౌత్‌ ఇండియన్‌ రివర్స్‌ లింకింగ్‌ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పీ అక్కక్కాను చెప్పారు. కనీసం ఈసారి వందమంది రైతులు ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యి వంద రోజులపాటు ఆందోళన నిర్వహించనున్నారు. తొలుత ఈ వారం ప్రారంభంలో వచ్చిన రైతులు ప్రధాని నివాసం ముందు ఆందోళనకు దిగే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారు ఇక జంతర్‌మంతర్‌ వద్ద ఉద్యమం కొనసాగించేందుకు సిద్ధమయ్యారు.

మరిన్ని వార్తలు