మానస సరోవర యాత్రలో మెరుగైన వాతావరణం

5 Jul, 2018 10:34 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ : మానస సరోవర యాత్రలో మెరుగైన వాతావరణం ఏర్పడింది. ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు గురువారం తగ్గుముఖం పట్టడం, వాతావరణం అనుకూలంగా ఉండటంతో అధికారులు సహాయ చర్యలను ముమ్మరం చేశారు. హెలికాఫ్టర్లు, విమానాలలో యాత్రికులు తమ బృందాలతో తిరుగు ప్రయాణమయ్యారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకోసం ఏపీ, తెలంగాణ ప్రతినిధులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సమికోట్‌ నుంచి నేపాల్‌ గంజ్‌కు వందలాది మంది భక్తులను తరలిస్తున్నామని, మూడు రోజుల్లో యాత్రికులంతా వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు