యూపీని కుదిపేసిన అకాల వర్షాలు

14 Mar, 2020 08:26 IST|Sakshi

లక్నో: గురువారం నుంచి ఉత్తర ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గడచిన 24 గంటల్లో 28 మంది మృతి చెందారని అధికారులు శుక్రవారం వెల్లడించారు. మరణించిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. గోడలు కూలడం, చెట్లు పడిపోవడం, పిడుగులు పడటం వంటి కారణాల వల్ల వీరంతా మృతి చెందినట్లు తెలిపారు. పిలిబిత్‌, సీతాపూర్‌, చాందౌలీ, ముజాఫర్‌నగర్‌, భాగ్‌పట్‌, బిజ్‌నోర్‌, ఔన్‌పూర్‌ జిల్లాలపై వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది.

మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల ఆర్థిక సహాయం అందించాలంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అధికారులను ఆదేశించారు. పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. పంట, పశువుల నష్టాన్ని అంచనా వేయాలని.. బాధితులకు తక్షణమే పరిహారం అందించాలని ఆదేశించారు. వర్షాలకు తోడు గాలిదుమ్ముల కారణంగా గోధుమలు, ఆవాలు పంటలు బాగా దెబ్బతిన్నాయి. బంగాళా దుంపల పంటలకు కూడా నష్టం వాటిల్లింది. (చదవండి: కేంద్ర ఉద్యోగుల డీఏ పెంపు)

మరిన్ని వార్తలు