రాజ్‌భవన్‌కు బెదిరింపు లేఖ

4 Dec, 2019 08:38 IST|Sakshi

లక్నో : ఉత్తర్‌ ప్రదేశ్‌ రాజ్‌భవన్‌కు బెదిరింపు లేఖ అందిందని రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి. గవర్నర్‌ పదిరోజుల్లోగా ఖాళీచేయని పక్షంలో రాజ్‌భవన్‌ను పేల్చివేస్తామని ఈ లేఖలో పేర్కొన్నట్టు అధికారులు తెలిపారు. జార్ఖండ్‌ నక్సల్‌ గ్రూప్‌కు చెందిన టీఎస్‌పీసీ అనే సంస్థ నుంచి ఈ లేఖ అందిందని, డైనమేట్‌తో రాజ్‌భవన్‌ను పేల్చివేస్తామని లేఖలో హెచ్చరించారని రాజ్‌భవన్‌ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. బెదిరింపు లేఖను తీవ్రంగా పరిగణిస్తున్నామని ప్రకటన పేర్కొంది. యూపీ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ అదనపు ప్రత్యేక కార్యదర్శి హేమంత్‌ రావు ఈ లేఖను రాష్ట్ర హోంశాఖకు పంపారు. కాగా, రాజ్‌భవన్‌కు బెదిరింపు లేఖ రావడంపై పోలీస్‌ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించారు.

మరిన్ని వార్తలు