మాటలొద్దు.. పని చేయండి: రాజ్‌ఠాక్రే

26 Nov, 2014 22:49 IST|Sakshi

సాక్షి, ముంబై: కరువు ప్రాంతాల బాధితులపై వివాదాస్పద వ్యాఖ్యలు చే స్తూ కాలయాపన చేసే బదులు వారికి ఉపయోగపడే పనులేవైనా చేస్తే ఎవరైనా హర్షిస్తారని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే హితవు పలికారు. ఆయన బుధవారం ఔరంగబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రైతులను హేళన చేసే విధంగా మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి ఖడ్సే వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదన్నారు.

 భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా వ్యవహరించాలని సూచించారు. ‘రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కరువు తాండవిస్తోంది.. పంటలు పండక రైతులు బేజారవుతున్నారు.. చేసిన అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.. ఇలాంటి బాధాకరమైన సమయంలో రైతులను కించపరిచే విధంగా ఖడ్సే వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు.

 మంత్రి ఖడ్సేకు ‘సెల్’ బహుమతి..
  రైతులపై రెవెన్యూ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే చేసిన వ్యాఖ్యలు ఇంతట్లో సద్దుమణిగే అవకాశాలు కనిపించడం లేదు. జితేంద్ర జనావలే అనే శివసైనికుడు బుధవారం ఖడ్సేకు ఏకంగా ఓ మొబైల్ ఫోన్ బహుమతిగా పంపాడు. కరువు పీడిత ప్రాంత రైతులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా  ఖడ్సేకు శాంతాకృజ్ పోస్టు ఆఫీస్ నుంచి ఈ ఫోన్ పంపినట్లు చెప్పాడు.  

మరిన్ని వార్తలు