జైల్లో ఉన్నా.. ఆ డాన్‌ను లేపేస్తామంటున్నారు?

1 May, 2016 17:40 IST|Sakshi
జైల్లో ఉన్నా.. ఆ డాన్‌ను లేపేస్తామంటున్నారు?

న్యూఢిల్లీ: గత ఏడాది అక్టోబర్‌లో ఇండోనేషియాలో పట్టుబడ్డ అండర్‌ వరల్డ్ డాన్‌ ఛోటా రాజన్‌ ప్రస్తుతం తీహార్‌ జైలులో అత్యంత భద్రత మధ్య ఉన్నాడు. అయినా అతడికి చావు బెదిరింపులు ఆగడం లేదు. ఛోటా రాజన్‌ను చంపేస్తామంటూ తాజాగా దావూద్ ఇబ్రహీం నమ్మిన బంటు, గ్యాంగ్‌స్టర్ ఛోటా షకీల్‌ తీహార్‌ జైలు సీనియర్‌ అధికారికి  ఎస్సెమ్మెస్‌ చేశాడు. ఈ బెదిరింపు మెసేజ్ నేరుగా ఛోటా షకీల్‌ మొబైల్ ఫోన్‌ నుంచే వచ్చినట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజన్‌కు మంరిత అదనపు భద్రత కల్పించాలని జైలు అధికారులు నిర్ణయించారు.

 971504265138 సెల్‌ నంబర్ నుంచి తీహార్ జైలు లా అధికారి సునీల్‌ గుప్తాకు ఇటీవల ఓ ఎస్సెమ్మెస్ వచ్చింది. ఛోటా రాజన్‌ను అతిత్వరలోనే అంతం చేస్తామని ఆ ఎస్సెమ్మెస్‌ బెదిరించింది. ఆ వెంటనే తీహార్‌ జైలు ల్యాండ్‌లైన్‌ నంబర్‌ ఓ కాల్‌ కూడా వచ్చింది. అందులోనూ రాజన్‌ ను చంపేస్తామని బెదిరించారు. ఈ నేపథ్యంలో రాజన్‌కు మరింత భద్రత పెంచిన జైలు సిబ్బంది.. ఈ బెదిరింపుల గురించి పోలీసులకు సమాచారమిచ్చారు.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు