‘ఆ పేరు వల్ల మాకు పెళ్లి కావట్లేదు’

10 Aug, 2018 10:45 IST|Sakshi

జైపూర్‌ : తమ గ్రామానికి ముస్లిం పేరు ఉన్నందున గ్రామంలోని యువకులకు వివాహ సంబంధాలు రావడంలేదని గ్రామం పేరును మార్చుకున్నారు అక్కడి గ్రామస్తులు. రాజస్తాన్‌లోని బర్మీర్‌ జిల్లాకు చెందిన ఓ గ్రామం పేరు మీయాన్‌ కా బారా. ఈ పేరు కారణంగా గ్రామంలోని యువకులకు వివాహాలు కావడం లేదని, అధికారులు అనుమతితో మహేశ్‌ నగర్‌గా మార్చుకున్నారు. తమ గ్రామం పేరును మార్చాలని కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాన్ని కోరుతున్నామని, ఇన్ని సంవత్సరాల తరువాత అధికారులు స్పందించారని గ్రామస్తులు తెలిపారు.

దీనిపై స్థానిక ఎమ్మెల్యే హర్‌మీర్‌ సింగ్‌ మాట్లాడుతూ.. స్వాతంత్య్రానికి పూర్వమే గ్రామానికి మహేష్‌ నగర్‌ అని ఉండేదని, మధ్యలో కొన్ని కారణాల వల్ల గ్రామం పేరును మార్చారని పేర్కొన్నారు. గ్రామస్తుల వినతి మేరకు మహేష్‌ పూర్‌గా మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. జలోరి జిల్లాలో మరో రెండు గ్రామాల పేర్లను కూడా మార్చినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ గ్రామంలో హిందూవులు మెజార్టీగా ఉండగా, ముస్లిం కుటుంబాలు మైనార్టీగా ఉన్నారు.

కాగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు నగరాల, రోడ్ల పేర్లను మారుస్తున్న విషయం తెలిసిందే. యూపీలోని మొగల్స్‌రాయ్‌ రైల్వే స్టేషన్‌ పేరును ఇటీవల దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయగా పేరు మార్చారు. కాగా దేశ వ్యాప్తంగా మరో 27 ప్రాంతాల పేర్ల మార్పునకు ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారని, కొత్త పేర్లతో ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే ఇప్పటికి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అధికారుల తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా