ఎంపీ చెంప చెళ్లుమనిపించిన యువకుడు

20 Apr, 2016 09:14 IST|Sakshi
ఎంపీ చెంప చెళ్లుమనిపించిన యువకుడు

బార్మర్: రాజస్థాన్‌లోని బార్మర్ ఎంపీ సోనారామ్ చౌదరిపై ఓ యువకుడు చేయి చేసుకున్నాడు. సోమవారం బార్మర్‌లో జరిపిన పెళ్లికి ఎంపీ హాజరవగా ఆయనతో ఏదో విషయమై ఖర్తారం అనే యువకుడు వాగ్వాదానికి దిగాడు.

ఆవేశానికి లోనై ఆయన చెంప చెళ్లుమనిపించి పరారయ్యాడు. జిల్లా కలెక్టర్ సహా ఇతర ఉన్నతాధికారుల సమక్షంలోనే ఈ దాడి జరగడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని పట్టుకుని అరెస్టు చేశారు.
 

>
మరిన్ని వార్తలు