డెంగ్యూ ఎఫెక్ట్: డాక్టర్లకు సెలవులు రద్దు

15 Sep, 2016 20:07 IST|Sakshi
డెంగ్యూ ఎఫెక్ట్: డాక్టర్లకు సెలవులు రద్దు

రాష్ట్రంలో డెంగ్యూ, చికన్ గున్యాలతో పాటు వైరల్ జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైద్యుల సెలవులు రద్దుచేయాలని, వారి బదిలీలపై కూడా నెల రోజుల పాటు నిషేధం విధించాలని రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వాస్పత్రులకు వైరల్ జ్వరాలు, డెంగ్యూ, చికన్ గున్యాలతో చాలామంది వస్తున్నారని, ఇలాంటి సమయంలో తాము ఎక్కువగా రిస్క్ తీసుకోలేమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖాధికారి ఒకరు తెలిపారు.

అందుకే వైద్యుల సెలవులు రద్దుచేశామని, అక్టోబర్ 14 వరకు వాళ్లకు బదిలీలు కూడా ఉండవని అన్నారు. మలేరియా, డెంగ్యూ, చికన్ గున్యా లక్షణాలతో వచ్చే పేషెంట్లకు వీలైనంత వెంటనే రక్త పరీక్షలు, ఇతర వైద్య పరీక్షలు చేయాలని సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. పేషెంట్లకు తాము ఈ పరీక్షలన్నీ ఉచితంగా చేస్తున్నామన్నారు. ఈ వ్యాధులకు సంబంధించిన మందులన్నీ ప్రభుత్వాస్పత్రులలో తగిన స్థాయిలో సిద్ధంగా ఉంచామని వివరించారు. రాష్ట్రంలోని జైపూర్, కోట, అల్వార్, భరత్‌పూర్ జిల్లాల్లో డెంగ్యూ తీవ్రత ఎక్కువగా ఉంది.

మరిన్ని వార్తలు