అత్యాచారం కేసులో.. మాజీ మంత్రికి సీబీఐ కస్టడీ

26 Oct, 2013 19:04 IST|Sakshi
అత్యాచారం కేసులో.. మాజీ మంత్రికి సీబీఐ కస్టడీ

అత్యాచారం కేసులో రాజస్థాన్ మాజీ మంత్రి బాబూలాల్ నాగర్ను సీబీఐ కస్టడీకి తరలించారు. శనివారం ఆయనను సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. సీబీఐ అభ్యర్థన మేరకు న్యాయస్థానం ఆయనను మూడు రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని నాగర్ న్యాయవాది వెల్లడించారు.

రాజస్థాన్ పాడి, గ్రామీణ పరిశ్రమల మంత్రిగా ఉన్న 53 ఏళ్ల నాగర్పై ఇటీవల అత్యాచార ఆరోపణలు రావడం, ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. రాజకీయ దుమారం చెలరేగడంతో కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. శుక్రవారం సీబీఐ అధికారులు ఆయనను ఏడు గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు. తనకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఇంటికి పిలిపించుకుని తనపై అత్యాచారం చేసినట్టు ఓ 35 ఏళ్ల యువతి గత నెలలో బాబూలాల్పై కేసు దాఖలు చేసింది.

మరిన్ని వార్తలు