కరోనా ఎఫెక్ట్‌: దేశంలో తొలిసారి ఓ రాష్ట్రం షట్‌డౌన్‌

22 Mar, 2020 08:27 IST|Sakshi

జైపూర్‌: కరోనా వైరస్ పంజా విసురుతున్న వేళ దేశంలో తొలిసారిగా ఒక రాష్ట్రం పూర్తిగా షట్ డౌన్ అయింది. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా రాజస్థాన్ రాష్ట్రాన్ని మార్చి 31 వరకు షట్ డౌన్ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శనివారం ప్రకటించారు. దీంతో దేశంలో కరోనా వైరస్‌ ప్రభావంతో పూర్తిగా నిర్బంధంలోకి వెళ్లిన తొలి రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. ప్రజలందరూ పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వానికి సహకరించాలని సీఎం అశోక్ గెహ్లాట్ కోరారు. శనివారం అర్ధరాత్రి నుంచి రవాణా వ్యవస్థను కూడా పూర్తిగా నిలిపివేస్తున్నట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి ప్రకటించారు. చదవండి: జనతా కర్ఫ్యూ: ఆ 14 గంటలు ఏం జరగబోతుంది? 

అత్యవసర సేవలు తప్ప అన్నీ బంద్ అవుతాయని స్పష్టం చేశారు. పేదలకు ఆహార పొట్లాలు సరఫరా చేస్తామని వెల్లడించారు. ఇందుకోసం ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 ప్రకారం అర్హులైన వారందరికీ గోధుమలను ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఈ మహమ్మారిని నివారించే క్రమంలో తీసుకున్న చర్యలకు మీ అందరి సహకారం కావాలి. ప్రజలు ఇళ్లకే పరిమితమై ఉండటం కరోనా వైరస్ నియంత్రణలో అతి ముఖ్యమైన చర్య’ అని అశోక్ గెహ్లాట్ అన్నారు. కాగా.. రాజస్థాన్‌లో శనివారం కొత్తగా 6 కరోనా పాజిటవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 23కు పెరిగింది. 
చదవండి: తెలంగాణలో ప్రారంభమైన జనతా కర్ఫ్యూ 

మరిన్ని వార్తలు