రాజస్తాన్‌లో యూజీ, పీజీ పరీక్షలు రద్దు

5 Jul, 2020 18:58 IST|Sakshi

జైపూర్‌: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. వైరస్‌ బారిన పడినవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈ ఏడాది అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న కాలేజీల్లో జరగవల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలను రద్దు చేసింది. రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ నివాసంలో ఆదివారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం కరోనా వైరస్‌ కారణంగా రాష్ట్రం ప్రభుత్వం ఈ ఏడాది డిగ్రీ, పీజీ పరీక్షలను రద్దు చేస్తుందని సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ నిర్ణయం అన్ని యూనివర్సిటీల పరిధిలోని కాలేజీలతోపాటు టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లకు కూడా వర్తిస్తుందని తెలిపారు. (ఏడాది పాటు మాస్క్‌లు తప్పవు)

ఇక విద్యార్థులందరూ పరీక్షలు లేకుండా వచ్చే సంవత్సరానికి ప్రమోట్‌ అవుతారని అన్నారు. విద్యార్థుల మార్కులకు సంబంధించి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరి కొద్ది రోజుల్లో జారీ చేయాల్సిన మార్గదర్శకాలను అధ్యయనం చేసి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇటీవల రాజస్థాన్ విశ్వవిద్యాలయం యూజీ, పీజీ పరీక్షలను జూలై 15 నుంచి ఆగస్టు 18 వరకు నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. (వెంటిలేటర్ల ఎగుమతికి సిద్ధం : డీఆర్‌డీఓ)

మరిన్ని వార్తలు