ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన గవర్నర్‌.!

2 Apr, 2019 12:31 IST|Sakshi

జైపూర్‌ : రాజస్థాన్‌ గవర్నర్‌ కల్యాణ్‌సింగ్‌పై ఎన్నికల సంఘం సీరియస్‌ అయింది. ఆయన ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ చర్యపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు దృష్టికి తీసుకొచ్చింది. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్‌ తటస్థంగా ఉండాల్సింది పోయి పక్షపాతంగా వ్యవహరించారని తెలిపింది. ఈ మేరకు కోవింద్‌కు లేఖ రాసింది. మార్చి 23న అలీఘర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌.. .. ‘మనమంతా బీజేపీ కార్యకర్తలం. బీజేపీ ఘనవిజయం సాధిస్తుంది. నరేంద్రమోదీ మరోసారి ప్రధానమంత్రి అవుతాడు. ఆయన ప్రధాని కావడం దేశానికి అవసరం’ అని వాఖ్యానించారు. కాగా, గవర్నర్‌ వ్యాఖ్యలపై సీఎం అశోక్‌ గహ్లోత్‌ స్పందించారు. గవర్నర్‌ కల్యాణ్‌సింగ్‌ వ్యాఖ్యలు దురదృష్టకరం. ఇలాంటి చర్యలు ఆ పదవికి ఉన్న హుందాతనాన్ని తగ్గిస్తాయి అని విచారం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా కూడా కల్యాణ్‌సింగ్‌ అంటే తనకు అభిమానమని, ఎంతో సీనియర్‌ లీడర్‌ అయిన ఆయన బాధ్యతాయుత పదవిలో కొనసాగుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం అని ట్వీట్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు